Friday, November 22, 2024

Breaking: డ్రగ్స్ కల్చర్ బీజేపీ, కాంగ్రెసోల్లది.. చిల్లర వ్యవహారాలు మానుకోండి: బాల్క సుమన్

డ్రక్స్ కల్చర్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల‌దేన‌ని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డ్రగ్స్ వాడుతూ పబ్ లో దొరికిన వారిలో ఒకరేమో బీజేపీ ప్రముఖ నాయకురాలి కుమారుడని, మరొకరు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేనల్లుడిని వివరించారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల కుటుంబ సభ్యులు డ్రగ్స్ కు అలవాటు పడ్డారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పేకాట క్లబ్ లు మూసి వేశామన్నారు. మాట్లాడితే డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి అందర్నీ ఉరితీయాలని మాట్లాడతాడని ఇప్పుడు ఎవరిని ఉరితీయాలో తేల్చుకోవాల‌ని సుమ‌న్ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement