Friday, November 22, 2024

ఇండో..పాక్ సరిహద్దులో డ్రోన్ కలకలం.. అప్రమత్తమైన బీఎస్ ఎఫ్ సిబ్బంది

మరోసారి డ్రోన్ తో చొరబాటు చర్యలు చేపట్టింది పాకిస్థాన్.. దాంతో పోలీసులకు..ఇతర ఏజెన్సీలకు సమాచారం అందించాలమని బీఎస్ ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.ఇండో-పాక్ సరిహద్దులోని బోర్డర్ ఔట్ పోస్ట్ (బీఓపీ) డాక్ వద్ద పాకిస్థాన్ ప్రయత్నాన్ని అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సిబ్బంది మరోసారి భగ్నం చేశారు. సరిహద్దులో దట్టమైన పొగమంచుతో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. అప్పుడే సైనికులకు డ్రోన్ శబ్దం వినిపించింది. అప్రమత్తమైన సైనికులు వెంటనే కాల్పులు జరిపారు. కొద్దిసేపటికే సౌండ్ ఆగిపోయింది. దీంతో డ్రోన్ పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లిపోయిందని భద్రతా బలాలు భావించాయి.

కానీ, అనంతరం నిర్వహించిన గాలింపు చర్యల్లో పాకిస్థాన్‌ సరిహద్దుల్లో డ్రోన్ కుప్ప కూలి పడినట్టు గుర్తించారు. దీని తరువాత పాకిస్తాన్ రేంజర్ల సైనికులు డ్రోన్‌ను తీసుకెళ్లారు..ఈ ఘటన తర్వాత BSF, పోలీసులు డావోకే గ్రామాన్ని చుట్టుముట్టారు. పోలీసులు, ఇతర ఏజెన్సీలతో కలిసి బీఎస్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సోదాల్లో భరోపాల్ గ్రామ సమీపంలోని ఓ పొలంలో పసుపు రంగు టేపుతో చుట్టిన ప్యాకెట్ కనిపించింది. దాంట్లో 4.3 హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా.. హెరాయిన్ తప్ప వేరే వస్తువులు దొరకలేదని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement