Thursday, November 21, 2024

రెన్యువల్స్‌కి టైమ్‌ పొడిగించేది లేదన్న కేంద్రం

ఈనెల 31లోపు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోవాలే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), వాహనాల అనుమతి రెన్యువల్‌ తదితర వాటి చెల్లుబాటు గడవు పొడిగింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఈ డాక్యుమెంట్ల ను రెన్యువల్‌ చేసుకోవడా నికి అక్టోబర్‌ 31వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈ గడువు ఇకపై పొడిగించే అవకాశమే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నిర్ణయంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ, వెహికిల్‌ పర్మిట్‌ రెన్యువల్‌ చేయడానికి కేవలం 12 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ రవాణా మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. అక్టోబర్‌ 31వ తేదీ తర్వాత అసంపూర్తి డాక్యుమెం ట్ల లో డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే, జరిమానా భారీగా చెల్లించా ల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. కరోనా మహమ్మారి కారణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ సహ అవసరమైన పత్రాలను రెన్యువల్‌ చేసుకునేందుకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ వచ్చింది.వాస్తవానికి వాహనాలకు సంబంధించిన పత్రాల గడువు ముగిసినా కూడా కరోనా కారణంగా 2020, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చెల్లుబాట య్యేలా గతంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిం ది. కానీ అక్టోబర్‌ 31 అంతిమగడు వుఅనిరవాణా శాఖ స్పష్టం చేసింది. కరోనా కారణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లాంటి డాక్యుమెంట్ల చెల్లుబాటు ను ఇప్పటి వరకు ఏడుసార్లు పెంచారు. 2020 మార్చి 30, 2020 జూన్‌ 9, 2020 ఆగస్టు 24, 2020 డిసెంబర్‌ 27, 2021 మార్చి 26, 2021 జూన్‌ 17, చివరిసారిగా 2021 సెప్టెంబర్‌ 30న మంత్రిత్వ శాఖ చెల్లుబాటును పొడిగించింది. ఇందుకోసం మోటార్‌ వాహనాల చట్టంలో కూడా మార్పులు తీసుకువచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు జనజీవనం గాడిన పడుతుండ టంతో లైసెన్సుల రెన్యువల్‌ గడువును పొడిగించకూడదని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement