Tuesday, November 12, 2024

KTR: హైదరాబాద్ కు తాగునీటి ఇబ్బందులు లేవు

హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీటికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి 2072 వ‌ర‌కు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందు చూపుతో ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌న్నారు. హైద‌రాబాద్ తాగునీటి అవ‌స‌రాల నిమిత్తం.. న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ ప‌నుల‌కు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వ‌రుస‌గా ఏడేండ్లు క‌రువు వ‌చ్చినా తాగునీటికి తిప్ప‌లు లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. భ‌విష్య‌త్‌లో హైద‌రాబాద్ న‌గ‌రం 100 కిలోమీట‌ర్ల విస్త‌రించిన తాగునీటికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుప‌లా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామ‌ని చెప్పారు. మెట్రో వాట‌ర్ స‌ప్లై, సీవ‌రేజ్ బోర్డు ఆధ్వ‌ర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement