అధిక మొతాదులో కాఫీ తాగడం హెల్త్‌కి మంచిది కాదు అని కొందరు అంటుంటారు. కానీ, డ్యూసెల్డార్ఫ్ విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రవేత్తలు అది తప్పు అని తేల్చి చెప్పేశారు.. జీవశాస్త్రవేత్తలు ఆల్స్ట్ కెమైడ్, హేండెలర్ చేసిన ఒక ప్రయోగంలో కెఫీన్ యొక్క ఆరోగ్య ప్రభావాలను కనుగొన్నారు. రోజూ నాలుగు కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, షుగర్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుందని ఆల్స్ట్ కెమైడ్ చెప్పారు. కెఫీన్ గుండె కణాల మైటో కాండ్రియా (పవర్‌హౌస్)లోకి p27 అనే ప్రోటీన్‌ను “పుష్” చేయగలదు. ఇది, ఆ గుండె కణాలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుందని వారు తెలిపారు.
వారు చేసిన ఒక ఎక్స్‌పెరిమెంట్‌లో.. ఎలుకలకు నాలుగు కప్పుల కాఫీకి సమానమైన కెఫిన్ ను ఇచ్చారు, తర్వాత వాటి గుండె ఆరోగ్యాన్ని పరిశీలించగా కెఫీన్ ఇంజెక్ట్ చేసిన వయస్సు ఎలుకలలో మైటోకాండ్రియా p27 ఉనికి ద్వారా ఎండోథెలియల్ కణాల యొక్క కదలిక ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇది గుండె ధమనుల వంటి రక్త నాళాలను పునర్నిర్మించడంతో పాటు హార్ట్ ఎటాక్ నుంచి రక్షించడంలో సహాయపడుతుందని వారు ఆ ప్రయోగం ద్వారా తెలుసుకున్నారు.
కానీ, కేన్సర్ లాంటి జబ్బు ఉన్న వాళ్లు కాఫీ తాగకపోకడం మంచదని ఈ ప్రయొగాలు చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే కెఫీన్ వల్ల కణాలు సమర్థవంతంగా ఎదుగుతున్నాయని.. అది ప్రమాదకరమైన కేన్సర్ కణాలు ఎదగడానికి దోహదపడే అవకాశం ఉందని వాళ్లు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital