ఓ బిల్డింగ్ నిర్మించాలంటే ఆ బిల్డింగ్ ని బట్టి సంవత్సరమో, రెండు సంవత్సరాలో పడుతుంది. కానీ ఇక్కడ కేవలం 45రోజుల్లోనే డీఆర్డీవో కొత్త బిల్డింగ్ ని నిర్మించి రికార్డు సృష్టించారు. బెంగుళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్‌లో కొత్త కాంప్లెక్స్‌ను కట్టింది. ఆ ఏడు అంతస్తుల ఎఫ్‌సీఎస్ కాంప్లెక్స్‌ను కేవలం 45 రోజుల్లోనే డీఆర్డీవో నిర్మించడం విశేషం. ఫిఫ్త్ జనరేషన్ అడ్వాన్స్‌డ్ విమానాల తయారీ కోసం ఈ కేంద్రాన్ని రీసర్చ్ సెంటర్‌గా వాడనున్నారు. నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ కాంప్లెక్స్‌ను ఆవిష్కరించనున్నారు. ఫైటర్ విమానాల కంట్రోల్ వ్యవస్థలకు సంబంధించిన ఏవియానిక్స్‌ను ఇక్కడ డెవలప్ చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..