Tuesday, November 26, 2024

డ్రాగ‌న్ ఫిష్ – ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన‌ది

ఒక చేప ఎంత ఖ‌రీదు ఉంటుందంటే మ‌హా అయితే వంద నుంచి ఐదు వంద‌లు అనుకుందాం. పుల‌స లాంటి చేప‌లు అయితే ఐదు వేల వ‌ర‌కు భారీ ధ‌ర‌ని ప‌లుకుతుంటాయి. అంతేకానీ ఏకంగా కోట్ల రూపాయ‌లు విలువ చేసే చేప‌లు ఉంటాయా అంటే ఔన‌నే అంటున్నారు. ఈ చేప పేరు డ్రాగ‌న్ ఫిష్, ఏషియ‌న్ అరోవానా అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఫిష్ ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీద‌యిన‌ది. దీని ధ‌ర ఎంతో తెలుసా రూ. 2 నుంచి 3కోట్లు. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా అక్ష‌రాలా నిజ‌మండీ. ఈ చేప‌ని కొన‌డానికి చైనా ప్ర‌జ‌లు రెడీగా ఉంటార‌ట‌..అంతేకాదు ఎంత ధ‌ర అయినా ఓకే అని చెబుతుంటార‌ట‌. ఈ చేపల వ్యవహారంతో జనం జైలుకి కూడా వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు.

చైనాలో ప్రజలు ఈ చేపను స్థితి చిహ్నంగా భావిస్తారు. ఈ చేపలు ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉంటుందని నమ్ముతారు. ఈ ఎరుపు రంగు చేప విలువైన వజ్రం లాంటిది. ప్రజలు దీనిని అక్వేరియంలో ఉంచుతారు. ఈ చేప రక్షణ కోసం చాలా మంది తమ సెక్యూరిటీని కాపలాగా ఉంచుతారు. 19వ, 20వ శతాబ్దాలలో డ్రాగన్ ఫిష్ కోసం ప్రజలు ఒకరినొకరు చంపుకునేవారని చరిత్ర చెబుతోంది. 2009లో డ్రాగన్‌ ఫిష్‌ వ్యాపారం చేసే ఓ వ్యక్తి తాను ఒక చేపను 3 లక్షల డాలర్లకు అమ్మినట్లు తెలిపాడు. ఆసియాతో పాటు అనేక దేశాలలో ఈ చేపలను అమ్మడంపై నిషేధం ఉంది. అదే సమయంలో అమెరికాలో మీరు ఈ చేపను బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అందుకే ఇక్కడ అక్రమంగా డ్రాగన్ ఫిష్ విక్రయించే వారికి జైలు శిక్ష తప్పదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement