Saturday, November 23, 2024

B Alert: వచ్చే నాలుగు వారాలు కీలకం..

దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న కొనసాగుతోంది. రోజు వారీకేసుల సంఖ్య లక్షల్లో ఉన్నాయి. థర్డ్ వేవ్ కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. భారత్లో రానున్న రెండు నుంచి నాలుగు వారాలు చాలా కీలకమని.. భారీగా కేసులు పెరిగేందుకు అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. ఒకరి ద్వారా ఆరు నుంచి 12 మందికి సోకే ప్రమాదముందని యూఎస్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ మనోజ్ జైన్ తెలిపారు.

రానున్న రోజుల్లో కేసులు అనూహ్యంగా పెరుగుతాయని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవు అని అన్నారు. ఒమిక్రాన్‌లో లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ సంక్రమణ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటోందన్నారు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు మాస్కును వాడటం తప్పని సరి అని అన్నారు. అలాగే, వ్యాక్సిన్‌ తీసుకోవటం అత్యంత కీలకం అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement