Friday, November 22, 2024

నా ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానం.. తమిళిసై

తన ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానాలున్నాయని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. రాజ్ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఫామ్ హౌజ్ కేసులోనూ రాజ్ భవన్ ను లాగాలని చూశారని తెలిపారు. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తుషార్ గతంలో ఏడీసీగా పనిచేశారన్నారు. తుషార్ పేరును ఉద్దేశ పూర్వకంగానే తీసుకొచ్చారన్నారు. తాను ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడలేదన్నారు. బిల్లును తొక్కి పెట్టాలనుకుంటే వివరణ ఎందుకు కోరతానని అన్నారు.

నియామకాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందే తానని తెలిపారు. రాష్ట్రంలో ఓ విధానం అమల్లో ఉన్నప్పుడు కొత్త తరహా విధానాన్ని ప్రభుత్వం తేవాలనుకుంటోందని చెప్పారు. ఈ నేపథ్యంగానే తనకున్న అనుమానాలపై వివరణ కోరినట్లు వెల్లడించారు.బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుపై మరిన్ని వివరాలు కావాలని అడిగానని తెలిపారు. యూనివర్సిటీలే కేంద్రంగా రిక్రూట్ బోర్డు ఉంటుందా అని గవర్నర్ తమిళిసై ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రజల కోసం రాజ్ భవన్ పారదర్శకంగా పనిచేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement