సదరన్ రైల్వే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వ్యాప్తిని నివారణలో భాగంగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే చెన్నై లోకల్ రైళ్లలో ప్రయాణానికి టికెట్లు ఇస్తామని తెలిపింది. జనవరి 10నుండి 31వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని వెల్లడించింది. రెండు డోసులు తీసుకోని వారిని లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణికులు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని దక్షిణ రైల్వే వివరించింది. ఈ నిబంధనలో ఎలాంటి సడలింపులు ఉండబోవని, సీజన్ టికెట్ తీసుకునేవారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు మొబైల్ ఫోన్లలో అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) అందుబాటులో ఉండదని చెప్పింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..