- డబుల్ ఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి
- అయోధ్య రామాలయాన్ని నిర్మించింది మోదీ కాదు.. మీ ఓటు
ఫేక్ వీడియోలను విడుదల చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఈ వీడియోల విడుదల వెనుక డబుల్ ఆర్ పాత్ర ఉందని ప్రధాని మోదీ అన్నారు. రేవంత్ రెడ్డి ఈ వీడియోలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డబుల్ ఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలతో ప్రజల్లో ప్రజల్లో గందరగోళం సృష్టించే యత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
‘అయోధ్య రామాలయాన్ని నిర్మించింది మోదీ కాదు…’
‘అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించింది మోదీ కాదు… మీరు మీ వేలితో వేసిన ఒక్కో ఓటు ద్వారా బాలరాముడి ఆలయం నిర్మించామని ప్రధాని అన్నారు. ప్రభుత్వం పటిష్ఠంగా ఉంటే ఏం జరుగుతుందో ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూశారన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం రాకముందే రామమందిర నిర్మాణం జరగాల్సింది కానీ, ఢిల్లీలో నాటి నుంచి పటిష్ఠ ప్రభుత్వం లేకపోవడంతో నిర్మించలేక పోయారన్నారు.
మోదీ మోదీ అంటూ నినాదాలు
ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున మోదీ మోదీ అంటూ అక్కడికి వచ్చిన వారు నినాదాలు చేశారు. ఈ ప్రేమను చూస్తుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. పలుమార్లు మోదీ మోదీ అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుందని మోదీ ఆరోపించారు.