Wednesday, November 20, 2024

డబుల్​ ఇంజిన్​ అంటే.. డబుల్​ కరప్షన్​: యోగీ, మోడీపై అఖిలేష్​ అటాక్​

ఉత్తరప్రదేశ్‌లో ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం’ ‘డబుల్ అవినీతి’కి దారితీసిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజ్నోర్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం కొత్తగా నిర్మించే పార్లమెంట్​లో ఏ రాజ్యాంగాన్ని తీసుకువస్తారో అన్న సందేహం అంతటా ఉందని అన్నారు. దళితులు అంటే బీజేపీకి చిన్నచూపు ఉందని.. అందుకని ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడం ఎంతో ముఖ్యం అన్నారు.   

ఒక చిన్న నాయకుడు చిన్న అబద్ధాలు.. పెద్ద నాయకుడు పెద్ద అబద్ధాలు చెబుతాడు.. ఆ పార్టీలోని అతిపెద్ద లీడర్​ అయితే అంతే స్థాయిలో అబద్ధాలు చెబుతాడు. డీమోనిటైజేషన్ అంటే అవినీతిని అంతం చేయడమే అన్నారు. ఆ తర్వాత ఏంజరిగిందో అందరికీ తెలిసిందే.. ఇక డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే డబుల్ అవినీతి” అని ఆయన మండిపడ్డారు. కాగా, నిన్న ఒక ఇంటర్వ్యూలో PM మోడీ, “యే దో లడ్కోన్ వాలా ఖేల్ తో హమ్నే పెహలే భీ దేఖా థా (ఇద్దరు అబ్బాయిల ఆట మనం ఇంతకు ముందు కూడా చూశాము) అని అన్నారు. అయితే ఇక్కడ మోడీ తన మాటల్లో వారు ‘‘గుజరాత్ యొక్క రెండు గాడిదలు’’ అనే పదాలను ఉపయోగించడం వివాదానికి దారితీస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement