Friday, November 22, 2024

Do’s and Don’ts…తెలంగాణ‌లో అమ‌లులోకి వ‌చ్చిన ఎన్నిక‌ల కోడ్….

హైద‌రాబాద్ – తెలంగాణ లో ఎన్నిక‌ల న‌గ‌రా మోగింది.. నేటి నుంచి ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చింది.. ఇక నామినేష‌న్ ల ప‌ర్వం న‌వంబ‌ర్ మూడో తేది నుంచి ప్రారంభం కానున్న‌ప్ప‌టికీ ఎన్నిక‌ల షెడ్యూల్ నేడు విడుద‌ల కావ‌డంతో నేటి నుంచే కోడ్ అమ‌లులోకి వ‌చ్చింది…. నేటి నుంచి అధికారిక కార్య‌క్ర‌మాల‌కు పాల‌క‌ప‌క్షం నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు దూరంగా ఉండాల్సి ఉంటుంది.. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని అమ‌లు చేసే బాధ్య‌త రాష్ట్ర ఎన్నిక‌ల అధికారితో పాటు ఆయా జిల్లాల ముఖ్య‌ రిట‌ర్నింగ్ అధికారుల‌పై ఉంటుంది.

ఎన్నికల కోడ్ ప్రకటించిన తర్వాత…ఎన్నికల ప్రవర్తన నియమావళి..
1.అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు.

2.అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు.

3.ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.

4.సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.

5.ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.

6.ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు… తదితర సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి.

7.పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.

8.టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.

9.ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు.

శంకుస్థాపనలు చేయకూడదు. రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement