Saturday, November 23, 2024

Shanghai: కలిసి పడుకోవద్దు.. ముద్దులు పెట్టుకోవద్దు.. ఇదంతా ఏంటనుకుంటున్నారా..? 

చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి చైనా ప్రభుత్వం వింత ఆంక్షలు విధించింది. గత కొద్ది రోజులుగా చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వాణిజ్య నగరం అయిన షాంఘైలో వైరస్ కలకలం సృష్టిస్తోంది. నిత్యం వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే, వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా స్థానిక అధికారులు వింత ఆంక్షలు విధించారు. ఈ రోజు రాత్రి నుంచి జంటగా ఒకేచోట పడుకోవద్దని, కౌగించుకోకూడదని, ముద్దులు పెట్టుకోవడానికి వీళ్లేదని ప్రకటించారు. ఈమేరకు అధికారులు వీధుల్లో తిరుగుతూ చాటింపు వేశారు.

మరోవైపు చైనాలో ప్రస్తుత COVID-19 వ్యాప్తికి షాంఘై హాట్‌స్పాట్. గత కొన్ని రోజులుగా రోజువారీ ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గినప్పటికీ, ఇతర దేశాలతో పోలిస్తే ఇది ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది. దీంతో నగరంలోని 26 మిలియన్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement