జోషిమఠ్ లో పరిస్థితిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూర్చున్న వ్యక్తులు దీనిపై వ్యాఖ్యానించవద్దని సూచించారు. అంతేకాకుండా వచ్చే నాలుగు నెలల్లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. హిందువుల ప్రసిద్ధ తీర్థయాత్రలలో ఒకటైన చార్ ధామ్ యాత్ర.. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ నాలుగు పవిత్ర స్థలాల పర్యటనను కలిగి ఉంటుంది. జోషిమఠ్ మీదుగా ఈ యాత్ర సాగనుంది.
కాగా జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంతో 800 ఇళ్లకు పైగా పగుళ్లు పడ్డాయి. నగరంలోని రోడ్లు, దేవాలయాలు, భూమిలో భారీగా పగుళ్లు కనిపించాయి. అయితే ఇప్పటి వరకు దాదాపు 250 కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించారు. ఈ పరిస్థితికి పాలకవర్గం చేసిన అభివృద్ది కార్యక్రమాలనే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
జోషిమఠ్ పరిస్థితిపై ఇతరులు మాట్లాడొద్దు.. సీఎం పుష్కర్ సింగ్ ధామి
Advertisement
తాజా వార్తలు
Advertisement