న్యూఢిల్లీ : కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి..కానీ ఎవరూ భయపడవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ఢిల్లీలో కూడా ఒమిక్రాన్ కేసులు వ్యాపిస్తున్నాయి. కాగా మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ..ప్రస్తుతం ఆసుపత్రుల్లో 82ఆక్సిజన్ బెడ్స్ మాత్రమే ఉండగా ..ఢిల్లీ ప్రభుత్వం 37వేల పడకలను సిద్ధం చేసిందన్నారు. కాగా యాక్టివ్ కేసులు 6,360గా ఉన్నాయన్నారు. నేడు, 3,100 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కేసుల పెరుగుదల ప్రభావం రెండవ వేవ్ సమయంలో ఉన్న దానికంటే చాలా తక్కువగా ఉందని డేటా చూపిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. కాగా కొత్త కేసులన్నీ తేలికపాటి లక్షణాలతో, లక్షణరహితంగా ఉన్నాయని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
కాగా డిసెంబర్ 29న యాక్టివ్ కేసులు దాదాపు 2,000 నుండి జనవరి 1న 6,000కి పెరిగాయి. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ లని తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కాగా ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య తగ్గిందన్నారు. ఆసుపత్రి ఆక్యుపెన్సీ తక్కువగా ఉందని, తదుపరి ఆంక్షలను త్వరలో సమీక్షిస్తామని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.కరోనా కేసులు పెరుగుతున్నందున ఢిల్లీ, హర్యానాతో పాటు అనేక రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూను విధించిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..