దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు మరో షాకిచ్చాయి. పెట్రోల్, డీజిల్ దరలతో పాటు వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెంచాయి. గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తెలంగాణలో సిలిండర్ ధర రూ.1002కు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1008కు పెరిగింది. పెంచిన ధర నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి. కాగా, దేశీయ వంట గ్యాస్ ధరను అక్టోబర్ తర్వాత మొదటిసారిగా మంగళవారం సిలిండర్‌కు రూ.50 చొప్పున పెంచారు. తాజా పెంపుతో 14.2 కిలోల నాన్-సబ్సిడీ LPG సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 949.50కి చేరింది. 5 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ.349కి చేరగా.. 10 కిలోల ధర 669కి చేరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement