ఓ కుక్క కారు ఇంజిన్ లో దూరి 70కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పుత్తూరు తాలుకా కబాక ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం… తన కుటుంబంతో కలిసి కారులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా… సుళ్య తాలుకా బల్పా గ్రామం వద్ద సడన్ గా వారి కారు కిందకు ఓ కుక్క దూరింది. కారు కింద పడిందేమో అనే అనుమానంతో ఆయన కారును ఆపాడు. కింద చూస్తే.. కుక్క కనిపించలేదు. అది పారిపోయింది లే అని వారు అనుకున్నారు. దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వారికి కారులో నుంచి వారికి ఏదో శబ్దం వినపడింది. తీరా ఏంటా అని చూస్తే…. ఇంజిన్ లోకి ఆ కుక్క దూరింది. కుక్క ఇంజిన్ లోకి ఎలా దూరిందో కూడా వాళ్లకు అర్థం కాలేదు. దానిని బయటకు తీయడం సాధ్యం కాక… మెకానిక్ సహాయం తీసుకోగా…. వారు అతి కష్టం మీద దానిని బయటకు తీయాల్సి వచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement