Friday, November 22, 2024

signature: డాక్టర్ ఉన్మాదం.. ఏకంగా లివర్ పైనే సిగ్నేచర్ చేశాడు..

ఓ వ్యక్తికి కాలేయ మార్పిడి చేసిన డాక్టర్​.. తన వృత్తికే అవమానకరమైన పని చేశాడు. తన పేరులోని మొదటి అక్షరాలతో ఆ లివర్​పై సంతకంలా చేశాడు. దీంతో యూకేకు చెందిన డాక్టర్ సైమన్​ బ్రామ్​హాల్​ పేరును.. మెడికల్​ ప్రాక్టీషనర్స్​ ట్రైబ్యునల్​ సర్వీస్​​- ఎంపీటీఎస్ మెడికల్​ రిజిస్టర్​ నుంచి తొలగించింది. అతడిని వైద్య వృత్తి నుంచి శాశ్వతంగా తప్పించింది. అయితే సైమన్​ ఆపరేషన్ చేసిన వ్యక్తి కొద్దిరోజులకే మరోసారి ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం కాస్త బయటపడింది. అతడి లివర్​పై 1.6 అంగుళాల సైజులో అక్షరాలను గుర్తించాడు మరో డాక్టర్. ఆ బాధితుడికి మొదట చేసిన కాలేయ మార్పిడి కూడా విఫలమైనట్లు అప్పుడే తెలిసింది. 2013 ఫిబ్రవరి, ఆగస్టులో.. ఇట్లా రెండుసార్లు కాలేయ మార్పిడి చేసిన సమయంలో వాటిపై తన ఇనీషియల్స్​ను రాసినట్లు సైమన్​ చెప్పాడు.

2017లో తన నేరాన్ని అంగీకరించాడు డాక్టర్ సైమన్. దీనికోసం ఆర్గాన్​ బీమ్​ మెషీన్​ను ఉపయోగించినట్లు వివరించాడు. విషయం బయటకు తెలిసిన తర్వాత.. సైమన్​ 2013లోనే కన్సల్టెంట్​ సర్జన్​ పోస్ట్​ నుంచి సస్పెండ్​ అయ్యాడు. విచారణ సమయంలో 2014లో బర్మింగ్​హామ్​ క్వీన్​ ఎలిజబెత్​ హాస్పిటల్​లో తన పదవికి రాజీనామా చేశాడు.

కాగా, రెండు కేసుల్లో సైమన్​ మొత్తం 13,619 డాలర్లు (రూ. 10 లక్షలకుపైనే) జరిమానా కట్టాలని, సమాజ సేవ చేయాలని మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రిబ్యునల్ సర్వీస్ ఆదేశించింది​​. 2020 డిసెంబర్​లో మరోసారి కేసును సమీక్షించి.. మెడికల్​ ప్రాక్టీస్​ చేయకుండా 5 నెలలు సస్పెన్షన్​ విధించింది ఎంపీటీఎస్. కానీ. అతని సత్ప్రవర్తన కారణంగా.. 2021 జూన్​లో అతడిపై ఉన్న సస్పెన్షన్​ను ఎత్తివేసింది. సస్పెన్షన్​పై ట్రైబ్యునల్​ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు జడ్జి.. నిందితుడిని వైద్య వృత్తి నుంచి తొలగించడమే సముచితమైనదని, అదే అతడికి శిక్ష అని స్పష్టం చేశారు.

సైమన్ ‘ఆటోగ్రాఫ్’​ వల్ల రోగికి ఎలాంటి శారీరక నష్టం జరగకపోయినా.. మానసికంగా ఎప్పటికీ వేధిస్తుందని విచారణలో మెడికల్​ ట్రైబ్యునల్​ కూడా పేర్కొంది. వైద్య వృత్తి నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు తాజా తీర్పులో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement