Thursday, November 21, 2024

Big Story: అమ్మాయిలు గూగుల్​లో ఏం సెర్చ్​ చేస్తున్నారంటే.. ఎక్కువగా దాని గురించేనట..

ఇప్పుడంతా గూగుల్​ యుగం.. ఏది కావాలన్నా ఫోన్​ తీసుకోవడం గూగుల్​లో సెర్చ్​ చేయడం కామన్​ అయిపోయింది. అయితే.. స్టడీస్​ పరంగా గూగుల్​ ఎంతో ఉపయోగపడుతున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం యువతీ యువకులు డైవర్ట్​ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.. ఈ మధ్య కాలంలో గూగుల్ సెర్చ్​ ఇంజిన్​ ద్వారా అమ్మాయిలు ఎక్కువగా ఏఏ విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారనే దానిపై ఓ సర్వే జరిగింది. ఈ సర్వేలో తేలిందేమిటంటే దాదాపు 17శాతం మంది టీనేజర్లు సెక్స్ గురించి గూగుల్​లో సెర్చ్ చేస్తున్నట్టు తెలింది. ఇంతకీ ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.   

ఆధునిక కాలంలో టెక్నాలజీ చాలా స్పీడప్​ అవుతోంది. ప్రస్తుతం స్మార్ట్​ ఫోన్​ లేని మనిషి లేరంటే నమ్మలేం కదా. రోజువారీ వ్యవహరాలు, కార్యకలాపాల కోసం ఫోన్​ని కచ్చితంగా వాడాల్సి వస్తున్న ఈ రోజుల్లో.. సాంకేతికతతో ఏ విషయాన్నైనా ఇంటర్నెట్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. కానీ, అలాంటి అసాధారణమైన సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో రాత్రుళ్లు అనేక విషయాల గురించి సెర్చింగ్ జరుగుతున్నట్టు ఈ మధ్య కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. మరీ ముఖ్యంగా మగాళ్లతో  కంపేర్​ చేస్తే మహిళలు నైట్​ టైమ్​లో ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని ఆ అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే.. ఆ స్టడీ ద్వారా తేలిందేమిటంటే అమ్మాయిలు కూడా అనేక విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారని తెలిసింది.  

2 కోట్ల మంది మహిళలు యాక్టివ్ గా..

జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. దేశంలో మొత్తం 150 మిలియన్ల (150 కోట్ల ఇంటర్నెట్ కలెక్షన్లు) ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అందులో 20 మిలియన్ల (2 కోట్లు) మంది మహిళలు ఆన్ లైన్ లో ఎక్కువగా గడుపుతున్నారు. అందులో 75 శాతం మంది మహిళలు 15-34 ఏళ్ల మధ్య వయస్సు వారే కావడం గమనార్హం. అధ్యయనం చేసిన నివేదికల ప్రకారం.. వారిలో 31 శాతం మంది టీనేజ్ అమ్మాయిలు, ఫిట్ గా ఉండేందుకు కావాల్సిన సమాచారం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో 17 శాతం మంది మాత్రం సెక్స్ రిలేటెడ్​ అంశాలు, డిప్రెషన్స డ్రగ్స్ మొదలైన వాటి గురించి ఎక్కువగా వెతుకున్నారట.. 

అమ్మాయిలు రాత్రుళ్లు గూగుల్ లో సెర్చ్ చేసే విషయాలు..

- Advertisement -

1) కెరీర్ నిర్మాణం కోసం కావాల్సిన టిప్స్ గురించి గూగుల్ లో ప్రధానంగా సెర్చ్​ చేస్తున్నారు. ఏ కెరీర్ ఎంచుకోవడం వల్ల జీవితంలో వృద్ధి సాధిస్తామనే సమాచారాన్ని అమ్మయిలు సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. 

2) అంతే కాకుండా ఆరోగ్య సూత్రాలు, కొత్త కొత్త చిట్కాల గురించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తమను తాము అందంగా ఉంచుకునేందుకు కూడా టిప్స్​ వంటి వాటి కోసం సెర్చ్​ చేస్తున్నారు.

3) అమ్మాయిలు తమ జుట్టు లేదా జడ విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తుంటారు. తమ జట్టును ఏ విధంగా కత్తిరించుకుంటే అందంగా ఉంటారో అనే విశేషాలను గూగుల్​లో సెర్చ్​ చేసి తెలుసుకుంటున్నారు.  

4) లవ్​ అండ్​ క్రష్​ గురించి కూడా అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్​ చేస్తున్నారు. తల్లిదండ్రులతో పంచుకోలేని అనేక విషయాలను గూగుల్​ ద్వారా సెర్చ్​ చేసి సొంతంగా తెలుసుకోవాలనే తాపత్రయంతో ఆలోచిస్తున్నారు.

5) మొటిమలను ఎలా తొలగించుకోవాలి. పీరియడ్స్, బాడీ హెయిర్, ఫ్యాషన్ వంటి సలహాలు ఇలా అన్ని విషయాల గురించి.. ప్రధానంగా టీనేజ్ సమస్యల గురించి గూగుల్​ చేసి తెలుసుకుంటున్నారు.

(నోట్: పైన పేర్కొన్న సమచారమంతా కొన్ని నివేదికలను అనుసరించి రాసినది మాత్రమే)

Advertisement

తాజా వార్తలు

Advertisement