యువకులు ఉద్యోగాల కోసం తిరుగుతూ చాలా కార్యాలయాల్లో ఆధార్ కార్డు వివరాలను ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తుంటారు. అంతేకాకుండా కొన్ని చోట్ల ఫోటోలను కూడా ఇస్తుంటారు. కానీ కొంతమంది వాటిని మిస్ యూజ్ చేస్తుంటారు. అలా వాళ్లు సమర్పించిన ప్రూఫ్‌లతో సిమ్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. అలా మనకు తెలియకుండానే మన పేరుతో ఫోన్ నంబర్లు ఉంటాయి. కానీ మన పేరు మీద మొత్తం ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో మనం సులభంగా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం సోమవారం ప్రారంభించింది. కొందరి పేర్ల మీద వాళ్లకు తెలియకుండానే నంబర్లు ఉన్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఒక పోర్టల్‌ను ప్రారంభించామని విజయవాడ టెలికాం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లో మొబైల్ నంబరు, దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో ఆ వివరాలన్నీ వచ్చేస్తాయి. వాటిలో అవసరం లేనివి, మనకు తెలియకుండానే ఉన్న నంబర్లను సెలక్ట్ చేస్తే చర్యలు తీసుకుంటామని టెలికాం శాఖ అధికారులు తెలిపారు. దీని వల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్ చెప్పవచ్చని పేర్కొన్నారు. తొలుత ఏపీ, తెలంగాణ సర్కిళ్లలో ఈ పోర్టల్ సేవలందిస్తుందని.. త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో మీకు తెలుసా?
By ramesh nalam
- Tags
- andhra pradesh
- breaking news telugu
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- new website
- telangana
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu trending news
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement