ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు నెలలో వచ్చే తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒకరోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. దీంతో స్నేహంలోని మాధ్యురాన్ని అందుకోవడానికి పరాగ్వేకు చెందిన ఆక్టర్ ఆర్టేమియో బ్రాచో 1958 జూలై 30న మిత్రులను మిలిచి వేడుకలను జరిపించాడు. దీనికి ఐక్యరాజ్యసమితి సైతం ఆమోదముద్ర వేసింది. అయితే తొలిసారిగా 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టులో తొలి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. దీంతో అనేక మంది స్నేహితులు ఈరోజున బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. స్నేహితుల బ్యాండ్లు కట్టుకుంటారు.
స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి మన జీవితంలో ఉండదు. మంచి మిత్రుడు ఉంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు.
ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. ‘స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది’. ‘జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది’. స్నేహం ఎంతో తియ్యనైంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.
ఈ వార్త కూడా చదవండి: తెలుగు గంగ కాలువలో కొట్టుకొచ్చిన చిరుత