కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రూల్స్ కఠినంగా అమలు చేస్తోంది. ఈమేరకు వైద్యారోగ్యశాఖ ఓ కీలక ప్రకటన కూడా చేసింది. మాస్క్ లేకుండా రోడ్కెక్కితే వెయ్యి రూపాయల ఫైన్ విధిస్తామని తెలిపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మాస్కు లేకుండా తిరిగే వారికి ఫైన్ వేస్తున్నారు.
ఈ క్రమంలో జె సురేశ్ కుమార్ అనే వ్యక్తి మాస్కు లేకుండా వచ్చినందుకు అతనికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద జరిమానా విధించారు. దానికి సంబంధించి స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ నల్లగొండ వారి నుంచి కౌంటర్ ఫైల్ రిసీప్ట్ కూడా ఇచ్చారు. ‘‘అందుకే సిటీతో పాటు పట్టణాలు, గ్రామాల్లో తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలి. ఇది మన హెల్త్ కోసమే పెట్టిన రూల్‌గా భావించాలి. ఉత్తపుణ్యానికి వెయ్యి రూపాయల ఫైన్ కట్టడం ఎవరికీ అంత మంచిది కాదు. అన్న విషయం ఆలోచించుకోవాలి‘‘ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.