Thursday, November 21, 2024

Rain Alert: వర్షం తగ్గగానే రోడ్లమీదికి రావొద్దు.. వాటర్​ లాగింగ్స్​ వద్ద జాగ్రత్త అంటున్న పోలీసులు!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామునుంచే చినుకులతో కూడిన వర్షం మొదలైంది. సిటీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (హెచ్‌టీపీ) ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం ముగిసిన వెంటనే ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్రారంభించవద్దని కోరుతున్నారు. ఎందుకంటే నీరు నిలిచిపోవడం వల్ల నగరంలోని వివిధ ప్రదేశాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశం ఉంది.

వర్షం తగ్గిన తర్వాత కనీసం దాదాపు 30 నిమిషాలైనా వేచి ఉండాలని హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు ప్రయాణికులను కోరుతున్నారు. ఈ టైమ్​లో డిశ్చార్జ్​ అవుట్​లెట్ల ద్వారా రోడ్లపై నిలిచిన నీరు బయటకు వెళ్తుందని, దాంతో ప్రమదాలు కూడా ఉండవని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

భారత వాతావరణ విభాగం (IMD) తెలిపిన వివరాల ప్రకారం జులై 25 వరకు హైదరాబాద్‌లో ఎక్కువ వర్షాలు ఉండనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) కూడా నగరంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నగరంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30-32 డిగ్రీల సెల్సియస్.. 20-22 డిగ్రీల సెల్సియస్‌ మధ్యలో నమోదయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. 

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా జులై 24 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 31-34 డిగ్రీల సెల్సియస్ నుంచి 20-23 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement