Wednesday, November 13, 2024

సింగరేణి ప్రైవేటీకరణ ఒప్పుకోం.. భగ్గుమంటున్న కార్మిక లోకం..

సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రభత్వ విప్​, ఎమ్మెల్యే బాల్క సుమన్​ అన్నారు. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కలతో దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని.. బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని సుమన్​ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో దేశంలోని ఇతర సంస్థల కంటే గొప్పగా లాభాలు సాధించిందన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లో ఉన్నట్టు చూపిస్తూ.. 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం, ప్ర‌ధాని మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ తెలంగాణ‌లో సింగ‌రేణి కార్మికులు ఆందోళ‌న చేస్తున్నారు. 4 సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేసి సంస్థ మనుగడను కాపాడాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున్న నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ ఆందోళ‌న‌లు టీఆర్ ఎస్ పార్టీ, TBGKS ఆధ్వర్యంలో మందమర్రి డివిజన్ పరిధిలోని జ‌రిగాయి. వీటిని బాల్క సుమన్​ తన ట్విట్టర్​లో పోస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement