తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ రవికి మధ్య వార్ నడుస్తోంది. నీట్ ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించకుండా గవర్నర్ స్పీకర్ కు తిప్పి పంపారు. దీంతో అక్కడి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ‘గెటౌట్ రవి’ అనే యాష్ ట్యాగ్ పేరుతో ఆందోళన చేస్తున్నాయి. దీనిపై డీఎంకే నేత కనిమొళి కూడా సీరియస్ గానే రెస్సాండ్ అయ్యారు.
నీట్ వ్యతిరేక బిల్లును అసెంబ్లీ స్పీకర్ అప్పావుకు తిరిగి పంపడంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవిపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత కనిమొళి మండిపడ్డారు. అంతకుముందు నీట్ వ్యతిరేక బిల్లును తిప్పి పంపడంపై తమిళనాడులోని వివిధ రాజకీయ సంఘాలు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును ఖండించాయి. దీని తర్వాత ట్విట్టర్‌లో ‘గెటౌట్‌రవి’ అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేయడం ప్రారంభించాయి. రాజకీయ నేతలు కూడా గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సామాజిక న్యాయానికి విరుద్ధమైన నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ ప్రభుత్వానికి తిప్పి పంపడం దిగ్భ్రాంతికరం అని కనిమొళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.