మాల్స్, మార్ట్స్ ఎక్కడ షాపింగ్ చేసినా క్యారిబ్యాగ్ పై అదనపు రుసుం వసూళ్లు చేస్తుంటారు. అయితే ఇకపై కస్టమర్లకు క్యారి బ్యాగ్ లను ఫ్రీగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైదర్ గూడ డిమార్ట్ పై ఉన్న కేసును వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా కీలక తీర్పు ఇచ్చింది వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం.
వినియోగదారుల నుండి క్యారీ బ్యాగ్ కోసం 3 రూపాయల 50 పైసలు తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా వెయ్యి రూపాయలు చెల్లించాలని.. అలాగే.. న్యాయ సేవాకేంద్రానికి మరో వెయ్యి రూపాయలు వినియోగదారునికి చెల్లించాలని హైదర్ గూడ డిమార్ట్ ను ఆదేశించింది కోర్టు. ఇప్పటి నుండి ఎలాంటి క్యారిబ్యాగ్ కు డబ్బులు వసూలు చేయద్దు అని వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 45 రోజుల్లో తీర్పు అమలు కాకపోతే చెల్లించాల్సిన మొత్తానికి 18 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని తెలిపింది వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..