చెన్నైకి చెందిన నగల వ్యాపారి తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్స్ అందించారు. అయితే అవి అట్లాంటి ఇట్లాంటి గిఫ్ట్స్ కావు.. తన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న వారికి పండుగ వేళ ఏదైనా సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతున్న వారికోసం కార్లు, బైకులు కొన్నాడు. దీపావళి కానుకగా వారికి వాటిని గిఫ్ట్‌గా అందించాడు తమిళనాడుకు చెందిన జయంతి లాల్.
చెన్నైలో చలని జ్యువెల్లరీ షాప్‌ను నిర్వహిస్తున్నాడు ఈ వ్యాపారవేత్త. తన దగ్గర పనిచేస్తున్న వారికి రూ.1.2 కోట్లు విలువచేసే 10 కార్లు, 20 బైకులను దీపావళి కానుకగా అందించాడు. వారిని ఉద్యోగులుగా చూడనని, తన ఫ్యామిలీ మెంబర్స్ మాదిరిగానే భావిస్తానన్నాడు. తన కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న వారికి పండుగ సందర్భంగా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానని, అందుకనే కార్లు, బైకులు కొన్నట్టు చెప్పాడు. ఇది వారి పనికి ప్రోత్సాహకంగా ఉంటుందని చెప్పాడు. ప్రతి యజమాని తన ఉద్యోగులను ఇట్లానే గౌరవిస్తే ఎంత బాగుంటుందో అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.