దీపాలు వెలిగించి..బాణసంచా కాల్చుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లు . ఇంటికి దూరంగా ఉన్నామనే లోటు కనిపించకుండా సంతోషంగా గడిపారు. రోజూ విధులు నిర్వహించే చోటే పండుగను జరుపుకున్నారు. దంతెరస్ సందర్భంగా లక్ష్మీ దేవీకి పూజలు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది జవాన్లు మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దుల్లో తామంతా అప్రమత్తంగా ఉన్నామని, భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా సంతోషంగా దీపావళి జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఏటా దీపావళికి ప్రధాని నరేంద్ర మోడీ సైనికులతో కలిసి వేడుకలు జరుపుకోవడం తెలిసిందే. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన దీపావళి వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా దీపావళి వేడుకలను సైనికుల మధ్యే జరుపుకోనున్నట్లు సమాచారం. అయితే, అది ఎక్కడ అనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు. భద్రతా కారణాలరీత్యా ఈ విషయాన్ని చివరి నిమిషం వరకూ రహస్యంగా ఉంచనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement