Tuesday, November 26, 2024

విడాకులకి ఫొటోషూట్.. భ‌ర్త‌ని విడిచి బ‌త‌కాలంటే ధైర్యం కావాలి

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో ర‌కాల ఫొటో షూట్ లు చూశాం. కాలం మారుతోంది..జ‌నాలు అప్ డేట్ అవుతున్నారు. దాంతో విడాకుల‌ని కూడా లైట్ తీసుకుంటున్నారు. చెన్నైలో నివసించే షాలిని అనే మహిళ తన భార్త నుండి విడిపోయిన తర్వాత.. డిప్రెషన్‌కు గురి కాకుండా విడాకుల ఫోటోషూట్ చేసుకుంది. విడాకులను సానుకూలంగా స్వీకరించింది. విన్నూతమైన శైలిలో ఫోటోషూట్ చేసింది. ఈ విడాకుల ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను షాలిని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొదటి ఫోటోలో షాలిని తన చేతిలో ‘డివోర్స్డ్’ అనే అక్షరాల దండను పట్టుకుని తన డివోర్స్ విషయాన్ని హైలైట్ చేసింది. రెండవ ఫోటోలో ఆమె ఒక చేతిలో మద్యం సీసా, మరొక చేతిలో ఓ బోర్డు పట్టుకుని నిలబడి ఉంది. మరొక ఫోటోలో షాలిని తాను,తన భర్త కలిసి ఉన్న ఫోటోను చింపివేయడం కనిపిస్తుంది.

ఇది కాకుండా..మరో ఫోటో షాలిని, ఆమె భర్త ఫోటో ఉన్న ఫ్రేమ్‌ను తన కాలితో తొక్కుతూ కనిపిస్తుంది. విడాకుల తర్వాత సాధారణంగా స్త్రీలు మానసికంగా కృంగిపోవడం కనిపిస్తుంది. భర్త నుండి విడిపోయిన తర్వాత వారు సాధారణ జీవితంలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ, షాలిని మాత్రం ఆ సనాతన భావజాలాన్ని బద్దలు కొట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో చిత్రాలను షేర్ చేయడమే కాదు.. పైపెచ్చు ఇలా రాసింది. ‘విడాకులు ఒక వైఫల్యం కాదు! ఇది మీకు , మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక మలుపు. భర్తను విడిచిపెట్టి ఒంటరిగా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి, నేను ఈ ఫోట్ షూట్ ను ధైర్యవంతులైన మహిళలందరికీ అంకితం చేస్తున్నానని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement