భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవ్వాల (శుక్రవారం) పంచాయతీ రాజ్ యాక్ట్ 2018 ప్రకారం జీవో నెంబర్ 45ని అధికారులు రిలీజ్ చేశారు. అంతేకాకుండా సారపాక గ్రామాన్ని కూడా రెండు పంచాయతీలుగా విభజించారు. భద్రాచలం రెవెన్యూ విలేజీలోని గ్రామాలైన భద్రచలం, సీతారాంనగర్, శాంతినగర్గా ఏర్పాటు చేశారు. ఇక.. సారపాక రెవెన్యూ విలేజీని సారపాక, ఐటీసీగా విభజించారు. అయితే భద్రాచలం గ్రామాన్ని విభజించొద్దని గతంలో ఆదివాసీ గిరిజనులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -