Tuesday, November 26, 2024

దేశాన్ని విడ‌దీయాలంటే – ది క‌శ్మీర్ ఫైల్స్ – ఐక్యం చేయాలంటే ‘ఆర్ ఆర్ ఆర్’ – ఎమ్మెల్యే సీత‌క్క‌

ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై ములుగు ఎమ్మెల్యే సీత‌క్క స్పందించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీపై ప్ర‌శంస‌లు కురిపించారు. తన అనుచరులతో కనిసి సినిమా చూసిన సీతక్క… ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’చిత్రాన్ని విమర్శిస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.‘దేశాన్ని విడదీయాలనుకుంటే ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చూడండి.. ఐక్యం చేయాలకుంటే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని వీక్షించండి’అని సీతక్క ట్వీట్‌ చేశారు. తారక్‌, చరణ్‌ అద్భుతంగా నటించారని కొనియాడారు. అలాగే ఈ చిత్రానికి అన్ని రాష్ట్రాల్లోనూ పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క చేసిన ట్వీట్‌ అంతటా వైరల్‌ అవుతోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement