Friday, November 22, 2024

ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌పాండేకు విశిష్ట సేవా పతకం

ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇవ్వాల‌ (మంగళవారం) పరమ విశిష్ట సేవా పతకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి అందుకున్నారు. జనరల్ మనోజ్ పాండే ఏప్రిల్ 30న భారత 29వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అలాగే లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్‌ ధిల్లాన్ (రిటైర్డ్)ను సైతం రాష్ట్రపతి కోవింద్ పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించారు. 14 కార్ప్స్ మాజీ కమాండర్, ప్రస్తుతం మిలటరీ కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ పీ గోపాలకృష్ణన్ మీనన్‌కు రాష్ట్రపతి ఉత్తమ యుద్ధ సేవా పతకాన్ని ప్రదానం చేశారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఘర్షణ సమయంలో అందించిన సేవలకు పురస్కారం అందజేశారు. 18 మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ అశుతోష్ కుమార్ తల్లిదండ్రులు రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్యచక్ర పురస్కారాన్ని అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement