పార్టీపై అసంతృప్తి ఉన్నా.. లేదా ఇబ్బందులున్నా… ఇతర సమస్యలు ఏమున్నా.. చింతన్ శిబిర్ సమావేశాల్లో స్వేచ్ఛగా చెప్పాలని ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నేతలకు లక్ష్మణ రేఖ గీచారు. ఆయా నేతల అభిప్రాయాలు, ఇబ్బందులు, సమస్యలు ఏమున్నా.. ఈ వేదిక మీదనే చర్చించాలని, అందుకు తగ్గ పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ అంతా ఏకతాటిపై ఉందన్న అభిప్రాయాన్ని సమాజానికి పంపాలని సూచించారు. అంతేకానీ.. బయట మాత్రం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, అసంతృప్తి వెళ్లగక్కొద్దని సోనియా సూచించారు. ఈ శిబిరం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కొత్త ఉత్సాహం, కొత్త నిబద్ధతతో, సరికొత్త నిబద్ధతతో వెళ్లాలని సోనియా ప్రతినిధులకు సూచించారు. ఇన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ అందరికీ ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సోనియా ఉద్బోధించారు.
అసంతృప్తి ఏమున్నా… చింతన్ శిబిర్ లో స్వేచ్ఛగా చెప్పాలి : లక్ష్మణ రేఖ గీచిన సోనియా
Advertisement
తాజా వార్తలు
Advertisement