Tuesday, November 26, 2024

Breaking: రాహుల్ గాంధీపై అనర్హత వేటు – 8 ఏళ్లు ఎన్నికలకు దూరం…

న్యూఢిల్లీ – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీపై అనర్హత వేటు పడింది. వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్​సభ సచివాలయం శుక్రవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మార్చి 23నే రాహుల్ గాంధీ ఎంపీ పదవికి అనర్హుడైనట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ప్రజాప్రతినిధులు ఎవరికైనా రెండేళ్లకుపైగా శిక్ష పడితే వెంటనే పదవికి అనర్హులవుతారు. అలా అనర్హతకు గురైన వ్యక్తి రానున్న 8 సంవత్సరాల వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే వీలు లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం జైలు శిక్షకాలంతో పాటు మరో 6 సంవత్సరాల పాటు ఎన్నికల బరిలో దిగేందుకు అనర్హులు. మోడీ పరువు నష్టం కేసులో రాహుల్​కు గుజరాత్​లోని సూరత్​ న్యాయస్థానం రెండేళ్లు కారాగార శిక్ష విధించింది. ఆ శిక్ష కాలం పూర్తయ్యాక.. మరో 6 సంవత్సరాలకు ఎన్నికలకు రాహుల్ దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే పరువు నష్టం కేసులో రాహుల్​ గాంధీకే శిక్ష గురువారమే ఖరారైంది. ఎగువ న్యాయస్థానంలో అపీల్ చేసుకునేందుకు వీలుగా సూరత్ కోర్టు 30 రోజులు బెయిల్ ఇచ్చింది. అప్పటివరకు శిక్ష అమలును నిలుపుదల చేసింది. అయితే అనూహ్యంగా 24 గంటలలోపే రాహుల్​పై అనర్హత వేటు పడింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement