ఫిబ్రవరి 11న థియేటర్లలో రిలీజ్ అయింది కిలాడీ చిత్రం. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించాడు. రమేష్ వర్మ తెరకెక్కించాడు. ఏ స్టూడియోస్ ఎల్ ఎల్పీ పతాకం పై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకు సౌండ్ ట్రాక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి శ్రీ ప్రసాద్ స్వర పరిచారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్, ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ కథ జనాల్లోకి ఎక్కక పోవడంతో డిజాస్టర్ గా మిగిలింది కిలాడీ. ఇది ఇలా ఉండగా తాజాగా కిలాడి సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. మార్చి 11వ తేదీన కిలాడి మూవీ డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
Advertisement
తాజా వార్తలు
Advertisement