Monday, November 18, 2024

దిశ ఎన్‎కౌంటర్ కేసు విచారణ జూన్ 21కి వాయిదా

దిశా ఎన్‎కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్ కౌంటర్ బాధితుల తరపున లాయర్ కృష్ణమాచార్య వాదనలు వినిపించారు. ఎన్‎కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై 302 పెట్టాలని హైకోర్టును కోరామని పిటిషనర్ తరపు లాయర్ వెల్లడించారు. ఎన్‎కౌంటర్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్లు లాయర్ కృష్ణమాచార్య తెలిపారు. నష్టపరిహారం అంశంలో హైకోర్టు సానుకూలంగా ఉందన్నారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు జూన్ 21కి వాయిదా వేసిందని వెల్లడించారు. దిశ కేసు తుది ఘట్టానికి చేరుకుందని..మరో రెండు వాయిదాల్లో ఈ కేసులో తీర్పు వచ్చే అవకాశముందని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement