Tuesday, November 26, 2024

సహజ వాయువు రవాణాకై చ‌ర్చ‌లు.. వ‌చ్చే ఏడాది ప్రారంబించే అవ‌కాశం..

దేశంలో సహజ వాయువును రవాణా చేసేందుకు ఉమ్మడి గ్యాస్‌ పైప్‌లైన్‌ను నిర్మించేందుకు చర్చలు జరుగుతున్నాయి. దీని కోసం స్వతంత్ర ఆపరేటర్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త ఏర్పాటుపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు ముగించిందని నివేదిక పేర్కొంది. వచ్చే ఏడాది ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌ (టీఎస్‌ఓ) ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించొచ్చు. దీని ద్వారా దేశంలో ఉన్న సహజ వాయువు మొత్తం రవాణా చేస్తారు. వచ్చే ఏడాది జనవరి నాటికి టీఎస్‌ఓపై కేబినెట్‌ ఆమోదం లభిస్తుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆ తరువాత దాని ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

గత బడ్జెట్‌లో టీఎస్‌ఓ ఏర్పాటు గురించి ప్రభుతం మాట్లాడింది. భారత్‌లో గ్యాస్‌ మార్కెట్లో ఒక స్థాయి వ్యాపారం చేయడానికి గ్యాస్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు అవకాశం కల్పించడం దీని ఉద్దేశం. ఈ కంపెనీలు తమ గ్యాస్‌ను రవాణా చేయగల ఉమ్మడి ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉండాలి. ప్రభుతమైనా.. ప్రైవేటు అయినా.. ఏ కంపెనీ పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదు. మొత్తం మీద.. దేశంలో గ్యాస్‌ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం టీఎస్‌ఓను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement