వాహన దారులకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిన రాయతికి మంచి స్పందన లబిస్తుంది. కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ ల పరిధిలో మూడు రోజుల్లో ఈ చాలన్ ద్వారా మూడు కోట్ల రూపాయలకు ఫైన వసూలు కావడం రికార్డ్. కరీంనగర్ కమిషనరేట్ పరిధి లో 81వేల చాలన్ లకు సంబంధించి 2 కోట్ల 96 లక్షల 85 వేలు, రామగుండం కమిషనరేట్ పరిధిలో 51,321 చాలన్ లకు సంబంధించి 2 కోట్ల 14 లక్ష 85 వేల రూపాయలు వసులు అయ్యాయి. పెండింగ్ చాలన్లలో మూడు రోజుల్లోనే 50 శాతం దాటడం విశేషం. పెండింగ్ చాలన్ల రాయతీ ఈ నెల 31 వరకు ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement