వాహనదారులు త్వరపడాల్సిన వార్త ఇది.. తెలంగాణ పోలీసులు పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ ఒక నెల రోజులపాటు టైమ్ ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో మరో 15 రోజులపాటు పొడిగించారు. ఆ గడువు కాస్త ఇప్పుడు దగ్గరపడింది. మరో మూడు రోజుల్లో పెండింగ్ చలాన్లపై తాత్కలిక డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది.
దీంతో మరోసారి గడువు పొడిగించేది లేదంటున్నారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. అయితే ఈ మూడు రోజుల్లో వాహనదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలోని రాచకొండ, హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిల్లో అనూహ్య స్పందన వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.