Friday, November 22, 2024

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు చుక్కెదురు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టేను ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. చిత్తూరు జిల్లాలోని ఆవులపల్లి రిజర్వాయర్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల ఫైన్ చట్టబద్దం కాదని ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. ప్రస్తుతానికి రూ.25 కోట్లను కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం ఏపీ ప్రభుత్వం పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement