ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బట్లర్ (39), జైస్వాల్ (22) మినహా ఎవరూ పోరాడలేకపోయారు. శాంసన్ (14), పడిక్కల్ (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన హెట్మెయర్ (11) కూడా నిరాశ పరిచాడు. శాంసన్ అవుటైన తర్వాత మందకొడిగా సాగుతున్న రాజస్థాన్ ఇన్నింగ్స్లో.. ఏ దశలోనూ వేగం పెరగలేదు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ వేగం పెంచేందుకు ప్రయత్నించిన హెట్మెయర్.. హార్దిక్ వేసిన 15వ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. చివరి బంతిని ఆడేందుకు ప్రయత్నించిన అతను.. మిస్ అయ్యాడు. దాంతో బ్యాటును తాకిన బంతి పాండ్యా వైపే వచ్చింది. అతను ఆ క్యాచ్ అందుకోవడంతో హెట్మెయర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ 130 పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయింది. కాగా, గుజరాత్ టైటాన్స్ 131 పరుగులు చేయాల్సి ఉంటుంది.
Breaking: ఫైనల్స్లో నిరాశపరిచిన రాజస్థాన్ బ్యాట్స్మన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..
Advertisement
తాజా వార్తలు
Advertisement