Friday, November 22, 2024

కనుమరుగైన పోలియో వైరస్​ వెలుగులోకి.. భయాందోళన వద్దన్న వైద్య నిపుణులు

ఎనిమిదేళ్ల క్రితం నిర్మూలించిన భయంకరమైన పోలియో వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చిందన్న వార్తతో చాలామందిలో భయాందోళన నెలకొంది. కోల్‌కతాలోని మురుగునీటిలో ఈ వైరస్‌ వెలుగులోకి వచ్చింది. దీన్ని మురుగునీటిలో పరిశీలించిన వైద్య నిపుణులు చెబుతున్నారు.అయితే భయాపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈవైరస్ మురుగు నీటిని పరిశీలించినప్పుడు బయటపడింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ముంబై జెనెటిక్ సీక్వెన్సింగ్ ఈ పరీక్షలు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇచ్చిన ఏ దేశంలోనైనా ఇది సంభవించవచ్చని అంటున్నారు అధికారులు.

కోల్​కతాలోని మెటియాబ్రూజ్ ప్రాంతంలోని బోరో నంబర్ 15 మురుగునీటిలో కనుగొనబడిన వైరస్ వ్యాక్సిన్ ఉత్పన్నమైన పోలియో వైరస్ అని, ఇది ముప్పు కలిగించదని అన్నారు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి. ఇది వైల్డ్ పోలియో వైరస్ కాదని, కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. వైల్డ్ పోలియో వైరస్ లాగా కనిపిస్తున్నా.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి  ఈ వైరస్ సోకదని చెబుతున్నారు.

పోలియోమైలిటిస్ (పోలియో) అనేది ఐదేళ్లలోపు పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది అత్యంత అంటువ్యాధి అని.. వైరల్ వ్యాధిగా చెబుతున్నారు. వైరస్ ప్రధానంగా-నోటి మార్గం ద్వారా సోకుతుందని, లేకుంటే సాధారణంగా కలుషితమైన నీరు లేదా ఆహార ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. పేగులో చేరి, అది నాడీ వ్యవస్థపై దాడి చేసి పక్షవాతానికి కారణమవుతుంది.

“మా నివారణ చర్యల్లో భాగంగా అన్ని ఆసుపత్రులు,వైద్య కళాశాలలు వారి సంబంధిత ప్రాంతాల్లో అవసరమైన నిఘా కార్యక్రమాలను నిర్వహించాలని కోరాము” అని పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DHS) డాక్టర్ సిద్ధార్థ నియోగి చెప్పారు. పోలియో వైరస్ యొక్క సాధ్యమైన జాడలను గుర్తించడానికి సాధారణ మరుగుదొడ్లు, రద్దీ ప్రాంతాలలోని కాలువలు వంటి వివిధ ప్రదేశాలలో నిఘా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

“నగర మురుగు నీటిలో వైరస్‌ను కనుగొనడం రెండు కారణాల వల్ల కావ.చ్చు– పోలియో సోకిన పిల్లవాడు లేదా ప్రత్యక్ష పోలియో వ్యాక్సిన్‌ను పొందిన పిల్లల ద్వారా వైరస్ విసర్జించబడి ఉండవచ్చు. పిల్లల బహిరంగ మలవిసర్జన కారణంగా వైరస్ మురుగునీటిలో కనుగొనబడింది” అని డాక్టర్ నియోగి వివరించారు. మీజిల్స్ తరచుగా వ్యాప్తి చెందడం,మెటియాబ్రూజ్ బోరో 15 వద్ద మురుగునీటి నమూనా నుండి VDPV టైప్ 1 వైరస్‌ను గుర్తించడం అనేది నిఘా యొక్క ఆవశ్యకతను సూచిస్తుందని డాక్టర్ నియోగి చెప్పారు.

- Advertisement -

చివరిసారిగా 2018లో న్యూఢిల్లీలో ఇటువంటి VDPV కనుగొన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. 2011లో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో కూడా పోలియో కేసు నమోదైంది. రెండేళ్ల బాలికకు ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. 2014 మార్చి 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ధ్రువీకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement