Tuesday, November 26, 2024

భార్యతో విడాకులు తీసుకున్న టాప్ డైరెక్టర్

ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో జంట విడిపోయింది. ప్రముఖ తమిళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత బాల తన భార్య ముధుమలార్ తో విడిపోయారు. నాలుగేళ్ల క్రితమే వీరిద్దరికీ విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. ఈ జంట చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దీంతో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరపడింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వీరిద్దరూ 2004లో మధురైలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రార్థన అనే కుమార్తె ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement