Friday, November 22, 2024

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమే – సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ దిశ నిందితుల కుటు-ంబ సభ్యులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దిశ నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని.. అందులో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని బాధిత కుటు-ంబాలు డిమాండ్‌ చేశాయి. అయితే దిశ నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికలో వెల్లడించింది. కోర్టుకు 387 పేజీలతో కమిషన్‌ నివేదిక అందించింది. పోలీస్‌ మాన్యువల్‌కు విరుద్ధంగా విచారణ జరిగిందని, ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకు కాల్చి చంపారని నివేదికలో పేర్కొంది. ఇది తక్షణ న్యాయం కోసమే ఎన్‌కౌంటర్‌ చేసినట్లు కమిషన్‌ నివేదికలో ఉంది. నిందితులు కస్టడీలో ఉన్నప్పటి నుంచి.. వేరే వింగ్‌ అధికారులు వెంబడే ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాకుండా.. విచారణ పేరుతో వేరే అధికారులు వేధించారు. స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌, గ్రేహౌండ్స్‌ పోలీసులు నిందితుల విచారణలో పాల్గొన్నట్లు, 10 మంది పోలీస్‌ అధికారులు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్లు తేల్చి చెప్పింది. సురేందర్‌, నరసింహారెడ్డి, షేక్‌ లాల్‌ మదార్‌, సిరాజుద్దీన్‌, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్‌, జానకీరాం, బాలు రాథోడ్‌, శ్రీకాంత్‌ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డారు. వీరిపై ఐపీసీ 302, రెడ్‌విత్‌ 34 ప్రకారం కేసు పెట్టాలని నివేదిక సూచించింది. నిందితులను హతమార్చాలనే ఉద్దేశంతోనే కాల్పులు చేసినట్లు కమిషన్‌ నిర్దారించింది. ఎన్‌కౌంటర్‌లో ఏసీపీ, ముగ్గురు సీఐలు, ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుల్స్‌ ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement