సరదాగా డిన్నర్ డేట్ కి వెళ్ళిన ఓ కపుల్ కి ఊహించని రీతిలో బిల్లు మోత మోగింది.వివరాలు చూస్తే అమెరికాకి చెందిన జెఫ్రీ పైజ్ తన భార్యతో కలిసి ప్రముఖ చెఫ్ గోర్డాన్ రామ్ సే రెస్టారెంట్ కి డిన్నర్ డేట్ కోసం వెళ్ళారు. జెఫ్రీ దృష్టి హోటల్ మెనూ కార్డ్‌లోని జపనీస్ A5 ‘కోబ్’ అనే డిష్‌పై పడింది. ఆ డిష్ ఎంతన్నది చూడకుండానే ఆర్డర్ ఇచ్చారు. ఇద్దరూ కూడా సంతృప్తికరంగా డిన్నర్‌ను కంప్లీట్ చేసుకున్నారు. చివరికి బిల్లు చూసి కళ్లు తేలేసారు. ఆ బిల్లు సుమారు రూ. 45 వేలు వచ్చింది. మీరు విన్నది నిజమే. ఏం జరిగిందంటే జెఫ్రీ పొరపాటు పడింది ఎక్కడంటే..
4 ముక్కల ‘కోబ్’ – రూ. 2500గా ఆమె భావించి.. మొత్తం 8 పీసెస్‌కు గానూ ధర రూ. 5800 అవుతుందని అనుకుంది. అయితే ‘కోబ్’ అసలు ధర $420.. దీనితో బిల్ కాస్తా తడిసిపోమోపిడయింది. చివరికి బిల్లు $ 576( అంటే రూ. 45 వేలు) కట్టాల్సి వచ్చింది. ఈ ఘటన సంవత్సరం క్రిందట జరిగిందని చెబుతూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఇప్పుడా బిల్లును పంచుకుంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొత్తగా ట్రై చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. లేదంటే ఇలానే వాచిపోతుంది. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా లాభం ఏం ఉండదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..