సినీ నిర్మాత దిల్ రాజు పండుగ రేస్ నుంచి వెనక్కి తగ్గారు. తెలుగులో విజయ్ వారసుడు సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ఆ సినిమా విడుదలను ఈనెల 11వ తేదీ చేయాల్సి ఉంది. అయితే సంక్రాంతి పండుగ రేస్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ల సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో ఆయన నిర్మాణం చేస్తున్న వారసుడు సినిమాను ఈనెల 14వతేదీ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
చిరంజీవి, బాలయ్యల సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలని, అందుకు తానే ఒక అడుగు వెనక్కి వేశానని తెలిపారు. తమిళ్ లో జనవరి 11ననే వారసుడు సినిమా రిలీజ్ అవుతుందన్నారు. థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తన మీద నిర్మాతలందరూ పడి ఏడుస్తున్నారన్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నారు. అందువల్ల నిర్మాతలందరూ బాగుండాలనే ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
- Advertisement -