హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : దాదాపు తొమ్మిదేళ్ళ కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు ఎట్ట కేటకు మోక్షం లభించబోతోంది. దసరా పండగకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసే దిశగా త్వరలోనే రాష్ట్ర ప్రభు త్వం చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభు త్వరంగ సాంకేతిక సంస్థ ‘నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్’ (ఎన్‌ఐసీ), రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థ ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ (సీజీజీ) సంయుక్త భాగస్వామ్యంతో కసరత్తు మొదలు పెట్టాయి. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫుడ్ సెక్యూరిటీ కార్డు (ఎఫ్‌ఎస్‌సీ) కోసం కొత్తగా ఒక ప్లాట్‌ఫాంను నెలకొల్పనున్నారు. తెలం గాణాలో అస్తవ్యస్తంగా ఉన్న రేషన్ కార్డుల వ్యవస్థపై ఇప్పటికే అనేక సార్లు కేంద్ర ఆహార భద్రత మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్ర భుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూరాలన్న సంకల్పంతో అమలవుతున్న నిత్యావసర సరుకుల పంపిణీని మరింత పారదర్శకంగా అమలు చేయాలని, అందేకు సాధ్యమైనంత త్వరలో కసరత్తు మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ ఈ మేరకు అధికార యంత్రాంగానికి మార్గదర్శకాలు ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ రంగ కార్యక్రమం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్‌తో ముడిపెట్టుకుని ఉన్న నిత్యవసర సరుకుల పంపిణీ వ్యవస్థ (రేషన్ సరఫరా)ను అత్యంత పారదర్శకంగా నెలకొల్పాలన్న లక్ష్యంతో అధికా రులు చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అతిత్వరలోనే డూప్లికేట్ కార్డుల ఏరివేత పక్రియ ప్రారంభం కానుంది. కొత్త కార్డుల కోసం వచ్చిన ధర ఖాస్తులు, రకరకాల కారణాల వల్ల కార్డుల్లోంచి తొలగించబడిన కుటుంబ సభ్యుల జోడింపు.. తదితర ససమ్యలకు కూడా పరిష్కారం లభించ నుంది. ఇప్పటికే కుటు-ంబాలను మించి కార్డులు రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటు-ంబాల కన్నా అత్యధిక సంఖ్యలో ఆహార భద్రత కార్డులు ఉన్నాయని పలు సర్వేలు తేల్చాయి. అనర్హులకు ఇచ్చిన కార్డులను ఏరివేయాలని రాష్ట్ర ప్రభు త్వం ఒకటి రెండు సార్లు ఆలోచించినా.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మొన్నటివరకు తాత్కాలికంగా విరమించుకుంది.
కుటు-ంబంలో ఎవరైనా మరణిస్తే.. రేషన్ కార్డు నుంచి సదరు వ్యక్తి పేరును తొలగిస్తున్న అధికారులు, కొత్తగా జన్మించిన వారి పేర్లను చేర్చడం లేదు. ఈ మార్పులు చేర్పుల కోసం ఎఫ్‌ఎస్‌సీఆర్‌ఎం వెబ్‌సైట్‌లో చేసుకుంటు-న్న దరఖాస్తుకే ఇప్పటివరకు మోక్షం కలగలేదు. 90.14 లక్షల ఆహార భద్రత కార్డులు ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 90,14,263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో ఉన్న యూనిట్ల (కుటు-ంబ సభ్యుల సంఖ్య) సంఖ్య 2.83 కోట్లు-గా ఉంది. అంటే రాష్ట్ర జనాభాలో మూడింట రెండొంతుల మేర ప్రజలు వీటి పరిధిలో ఉన్నారు. ఈ అంశంపైనే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ అత్యంతరాలు వ్యక్తం చేసింది. తప్పులను సవరించకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తే కేంద్రం రేషన్ నిలిపివేసే ప్రమాదం పొంచి ఉంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
ఇక రేషన్ కార్డుల్లో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద 48.86 లక్షల కార్డులు, అంత్యోదయ అన్నయోజన పథకం (ఏఏవై) కింద 5.62 లక్షల కార్డులు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి సబ్సిడీ భరిస్తూ ఇచ్చిన ఆహార భద్రత కార్డులు (ఎఫ్‌ఎస్‌సీ) 35.66 లక్షల మేర ఉన్నాయి. ఇందులో 5,211 కార్డులు అన్నపూర్ణ పథకం కింద వినియోగంలో ఉన్నాయి. అన్నపూర్ణ పథకం కింద కార్డుకు 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తారు. ఏఏవై, అన్నపూర్ణ మినహా మిగతా రేషన్ కార్డులపై ప్రతినెలా కుటు-ంబంలోని ఒక్కొక్కరికి రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అంది స్తుంది. కరోనా ప్రబలిన నేపథ్యంలో 2021 నుంచి ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఆ ప్రచారంలో నిజం లేదు గత ఎన్నికల ముందు ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు-గానే.. ఈసారి కూడా అవకాశం ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఆధార్ లింకుతో అక్రమాలకు అడ్డుకట్ట
దేశవ్యాప్తంగా రేషన్ ప్రక్రియలో అనేక లోటు-పాట్లు- ఉన్నాయి. ఒక వ్యక్తి తన రేషన్‌లో న్యాయమైన వాటా కంటే ఎక్కువ పొందడం లేదా రేషన్‌కు అర్హత లేని వ్యక్తులకు రేషన్ ఇవ్వడం, అర్హులైన వారికి రేషన్ దక్కకపోవడం వంటి ఘటనలు చాలా సందర్భాల్లో చోటు-చేసుకుంటు-న్నాయి. ఇలాంటి అక్రమాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్‌తో రేషన్‌కార్డ్ లింక్‌ను తీసుకొచ్చింది. దీంతో అర్హులకు సక్రమంగా రేషన్ అందడానికి అవకాశం ఉంటు-ంది.
త్వరలోనే ప్రారంభం : మంత్రి హరీష్‌రావు
త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీష్ రావు తాజాగా ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, కార్డులు ఇచ్చేందుకు అంతా సిద్ధమైందని తెలిపారు. మరోవైపు 2014 నుంచి రద్దయిన 21 లక్షల రేషన్ కార్డుల్లో తిరిగి అర్హులను గుర్తించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోందన్నారు.