హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. అధికారంలోకి వచ్చేందుకు ఆయా పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. పార్టీలు, అభ్యర్థులు నువ్వా.. నేనా.. అన్నట్లు- ప్రచారంలో మునిగిపోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో దూసుకుపోతు న్నాయి. ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలతో రాజకీయాల్లో రచ్చ రేపుతున్నారు. ఎవరికి వారు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు- సీఎం కేసీఆర్ ప్రచారాలతో హోరె త్తిస్తుంటే ఇటు- ప్రతిపక్షాలు మరో వైపు హోరెత్తిస్తున్నాయి. ఇక అభ్యర్థులు, పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ఎన్నికల యుద్ధానికి పూర్త్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇంటింటికీ తిరిగి ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. ఓటర్ లిస్టుతో ఇంటింటికీ వెళ్లి కార్యకర్తల ద్వారా వారు ఎటువంటి పథకాలు పొందారు… ఎందులో లబ్ధిదారులు… గతంలో వారు ఎవరికి అనుకూలంగా ఉన్నారు… ఇప్పుడు ఎవరికి మొగ్గు చూపిస్తున్నారు. వారు ఏంచేస్తే తమవైపుకు మళ్లుతారోనని తెలుసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే బూత్ స్థాయిలో గత ఎన్నికల్లో తమకు పోలైన ఓట్లు, ప్రత్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కలు తీస్తున్నారు. ఒక్కో ఇంట్లో ఓటర్ల సంఖ్య, పేరు, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం అంటే పోస్టర్లు, పాంప్లెట్లు-, ప్రచార వాహనాలు, మైకులు, బహిరంగసభలు. రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లు ఉండేవి. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా ప్రచారం అంటే పోస్టులు పెట్టడం.. బాట్స్ పెట్టి షేర్లు చేసుకోవడం.. పార్టీ సోషల్ మీడియా సైన్యాలతో పాజిటివ్ ప్రచారం చేసుకోవడం, కానీ ఇప్పుడు ఇన్‌ప్లnూయన్సర్స్ను రంగంలోకి దింపేశారు. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో దూకుడుగా ఉంది. సోషల్ మీడియా ఇన్‌ప్ల nూయన్సర్స్తో జోరుగా బీఆర్ఎస్ ప్రచారం జరుపుతోంది. గతం కంటే ఈసారి సోషల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వ సక్సెస్‌ను గతం, ప్రస్తుతం అంటూ ప్రభుత్వ సక్సెస్ స్టోరీలను ప్రచారంలోకి తెచ్చేందుకు విభిన్నమైన ప్రయత్నాలు చేస్తోంది. దళిత బంధు, రైతు బంధు, టీ-ఫ్రైడ్, కల్యాణలక్ష్మి, బీసీ, మైనార్టీలకు రూ.లక్ష సాయం, రైతు బీమా, ధాన్యం కొనుగోళ్లు, ష్కాలర్‌షిప్‌లు, గురుకులాలు, సన్నబియ్యంతో భోజనం, అల్పాహార పథకం, హైదరాబాద్ నగర అభివృద్ధి నాడు నేడు… ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఐటీ హబ్‌లు, ఆకాశహర్మ్యాలు, రహదారులు, రియల్ రంగం వృద్ధి, అంతర్జాతీయ ఐటీ కంపెనీల ఆఫీసులు, కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మృతి చిహ్నం వంటి అనేక నిర్మాణాలు, పనులు, సంక్షేమ పథకాలను కేస్ స్టడీలతో -టె-ండింగ్ చేసేందుకు, ప్రజల ముందు పెట్టేందుకు ఇన్‌ప్లnూయన్సర్స్ను రంగంలోకి దింపారు. నాడు ఎట్లు-ండే.. నేడు ఎట్లు-ండే వంటి క్లిప్లింగ్లతో వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తున్నారు. అదే సమయంలో సమాంతరంగా గులాబీ జెండాలే రామక్క అనే పాటను బీఆర్ఎస్ నేతలు వైరల్ చేశారు. ఇలా ఇన్‌ప్లnూయన్సర్స్ చేసిన వీడియోలను గ్రామాలవారీగా ఏర్పాటు- చేసిన వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్టుచేయాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ- హాల్స్, తాగునీటి పైపులైన్లు, ఇతరత్రా చేపట్టిన పనులను ఎంత వ్యయంతో చేశారనే వివరాలను సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా ఇతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల పరిస్థితిని సైతం వివరించేలా ప్లాన్ చేస్తున్నారు.
పథకాలపైనా బీఆర్ఎస్ జోరు…
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ముఖ్యంగా దళిత బంధు, రైతు బంధు, ప్రైడ్, కల్యాణలక్ష్మి, బీసీ మైనార్టీలకు లక్షసాయం, రైతుబీమా, 24 గంటల కరెంటు-, ఇంటింటికీ తాగునీరు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటివి లబ్ధిదారులతో కేస్ స్టడీ వారీగా సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని కేటీ-ఆర్ ఆదేశించారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్, ట్విట్టర్ ఇలా దేనిని ఓపెన్ చేసినా తెలంగాణ సంక్షేమ పథకాలే ప్రత్యక్షం అయ్యేలా చర్యలు తీసుకుంటు-న్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే అంశాలను మేనిఫెస్టోను సైతం వివరించే ప్లాన్ చేస్తున్నారు. కేటీ-ఆర్ నిత్యం పర్యవేక్షణ చేయడంతో పాటు- సలహాలు సూచనలు ఇస్తూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఎలా ఇవ్వాలలో నిర్వాహకులకు ఆదేశాలు ఇస్తున్నారు.
ఇతర పార్టీలూ తక్కువేం కాదు!
బీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నవారికి గాలమేస్తున్న రాజకీయ పార్టీలు వారిని ప్రచారానికి వాడుకుంటూ అడిగిన మొత్తాన్ని చేతిలో పెడుతున్నాయి. సరదాగా రీల్స్ చేస్తూ కం-టె-ంట్ ఇస్తూ అనుచరులను పెంచుకుందామని చేసిన ప్రయత్నాలు.. ఇప్పుడు వారికి సరికొత్త ఆదాయాన్ని తెస్తున్నాయి. రీల్స్ చేయడం, పార్టీ నేతల ప్రచారాలు, జనాల స్పందన ఇతరత్రా వీడియోలను ఇన్‌ప్లnుయెన్సర్లు తమ ఖాతాల్లో పెడుతూ మరింత ప్రచారం కల్పిస్తున్నారు. ఇలాంటి వారితో ప్రచారం చేయిస్తే సులువుగా ఎక్కువ మందికి చేరొచ్చని ఆలోచించిన ఆయా రాజకీయ పార్టీలు ఇన్‌ప్లnుయెన్సర్ల సేవలను వినియోగించుకుంటు-న్నారు.