Friday, November 22, 2024

డిఫరెంట్ లుక్స్.. బాలీవుడ్ లో పాగా.. యాక్టింగ్ లో ఇరగదీస్తున్న తాప్సీ

తాప్సీ పన్ను.. ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా సో సోగా అనిపించుకుంది.. చాలా సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు.. హీరో వెనకాల పడుతూ.. కుప్పిగంతులు వేస్తూ నటించిన ఈ చిన్నది ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లి కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఆమె ఎంచుకునే సినిమాలు, ఫార్ములా వంటివి ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు. లేడీ ఓరియంటెడ్ మూవీస్, డిఫరెంట్ లుక్స్ తో జనాలను అట్రాక్ట్ చేస్తోంది..

టాలీవుడ్ కి టాటా చెప్పిన తాప్సీ.. ఆ తర్వాత బాలీవుడ్ లో పాగా వేసింది.. తనదైన స్టైల్ తో ఇప్పుడు బాగా రాణిస్తోంది. ప్రధానంగా విమెన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ.. బాగా పేరు తెచ్చుకుంటోంది. దక్షిణాదిలో పదేళ్ల క్రితం తన నటనా జీవితం ప్రారంభించినప్పుడు ఎలాంటి ప్రణాళిక కానీ,  దీర్ఘకాలికంగా తాను ఏం చేయాలనే విషయలేవీ తెలియదు అంటోంది ఈ చిన్నది.  సినీ పరిశ్రమలో కేవలం ఐదు నుండి ఏడు సంవత్సరాలు ఉంటాను కావచ్చు అనే చిన్న టార్గెట్ తో వచ్చాను అని చెబుతోంది ఈ బ్యూటీ.. సినీ రంగంలో దాదాపు హీరోయిన్ల లైఫ్ టైమ్ ఇట్లనే ఉంటుందని అంటోంది.  

కాగా, ఒక దశాబ్దం తర్వాత వేరే వృత్తిలో స్థిరపడాలని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పినట్టు గుర్తుచేసకుంటోంది తాప్సీ పన్ను.  అయితే.. తన యాక్టింగ్ త్వరగా ముగిసిపోలేదని, అది తన విధి రాత కావచ్చని  చెప్పుకొచ్చింది. ‘‘ఒక నటి ఒక సినిమా చేస్తే.. ఆ మూవీ ప్రజలను మెప్పించేలా ఉండాలి.. ప్రజల కోణంలో కథా నాయిక లీడ్ చేయాలి.. అలా చేసినవి చూసి  మరో 10 మంది నటీమణులు ఈ రంగంలోకి రావాలి’’ అని తాప్సీ నవ్వుతూ చెప్పింది. అయితే.. తన కంటే  ముందు వచ్చిన నటీమణులంతా  అలాంటి అవకాశాలను సృష్టించారని, వారిని ఇన్ స్పిరేషన్ గా తీసుకుని తాను కూడా నటనా రంగాన్ని ఎంచుకున్నట్టు చెప్పింది. ఇట్లా ఒకరి ద్వారా మరొకరు ప్రజల జీవన విధానాలపై యాక్టింగ్ చేయడం ద్వారా సమాజంలో మంచి మార్పునకు కృషి చేయాలని.. అట్లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెబుతోంది సొట్టబుగ్గల చిన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement